ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్

0
375

రాష్ట్రంలో మహిళలపై ఎలాంటి అరాచకాలు జరగకుండా, ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వారిని శిక్షించి బాధితురాలికి న్యాయం చేసే, లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దిశ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాజమండ్రిలో ఏర్పాటు ఏర్పాటు చేసిన మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్ లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించగా దానికి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు హాజరయ్యారు. దీనిలో లో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం మచిలీపట్నం కాన్ఫరెన్స్ హాల్ నందు వీడియో కాన్ఫరెన్స్ కు గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు అడిషనల్ ఎస్పీ శ్రీ సత్తి బాబు గారు, ట్రైన్ ఐపిఎస్ శ్రీకృష్ణ కాంత్ పటేల్ గారు, బందర్ డిఎస్పి మహబూబ్ బాషా గారు, సిఐలు, ఎస్సైలు, మచిలీపట్నం పరిధిలోగల మహిళా మిత్ర సంఘ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply