మచిలీపట్నం నుంచి బెంగళూరుకు గరుడ ఏసి సర్వీసులు…

0
802

మచిలీపట్నం నుంచి బెంగళూరుకు ప్రథమంగా గరుడ ఏసి సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు డిపో మేనేజర్‌ మూర్తి తెలిపారు.సోమవారం తన చాంబర్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 3.30 గంటలకు మచిలీపట్నం నుంచి బస్సు బయల్దేరి మర్నాడు ఉదయం 7.15 గంటలకు చేరుతుందన్నారు.బెంగళూరు నుంచి సాయంత్రం 6.30 గంటలకు బయల్తేరి ఆ మర్నాడు ఉదయం 9.15 గంటలకు చేరుతుందన్నారు. ప్రయాణికులకు వాటర్‌ బాటిళ్లు, టిష్యు పేపర్‌, బ్లాంకెట్‌తో పాటు ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌,సెల్‌ఫోన్‌ చార్జర్‌, అటెండర్‌ సేవలు అందిస్తామన్నారు. ఈ నెల 29న మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఈ సర్వీసులు ప్రారంభిస్తారని డీఎం మూర్తి తెలిపారు.


Leave a Reply