1907 ఏప్రిల్ 26,27,28 లో జాతీయ నాయకులు బిపిన్‌చంద్రపాల్ బందరు వచ్చారు. గొడుగుపేట నాటక కళాశాలలో జరిగిన సభలో జాతీయ విద్య అవశ్యకతపై ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ సభానంతరం కొన్ని రోజులకు పట్టణ ప్రముఖులు సమావేశమై ఆంధ్ర జాతీయ విద్యాపరిషత్తు స్థాపించడం, ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపనకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. శ్రీపాల్ 1910 లో ఆంధ్రజాతీయ కళాశాలకు బందరులో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బందరులో ‘యంగ్మెన్స్ స్వరాజ్ సమితి’ ఏర్పడింది.
