బందరులో సురభి 70 చిత్రం షూటింగ్…

0
353


బందరులో సురభి 70 చిత్రం చిత్రీకరణ చేశారు.డైరెక్టర్‌ ఎ.గంగాధర్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌ అచ్యుత్‌ శ్రీనివాస్‌ నటిసున్నారు. కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో అనేక పాత్రలు పోషించి అచ్యుత్‌ శ్రీనివాస్‌ సురభి 70లో విభిన్న పాత్ర పోషిస్తుండగా మహేష్‌ వినోద్‌, అనిల్‌ చందు, మల్లిఖార్డునరావు నటిన్తున్నారు.దర్శకుడు గంగాధర్‌ మాట్లాడుతూ, ప్రాచీన సురభి నాటకాల విశిష్టతను చాటేందుకు ఈ చిత్రం తీస్తున్నామన్నారు. బందరు కళలకు, కళాకారులకు ప్రసిద్ది అని, పరిసరాలు కూడా ఎంతో సినిమా చిత్రీకరణకు అనువుగా ఉన్నాయని, 20 మంది ప్రముఖ రంగస్థల కళాకారులను ఈ చిత్రంలో నటించాల్సిందిగా కోరామన్నారు. ఎంతో పురాతనమైన బృందావన్‌ థియేటర్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరించడం ఆనందంగా ఉందన్నారు.

Leave a Reply