బందరులో అంతర్ కళాశాల ఫుట్బాల్ పోటీలు ప్రారంభం…

0
360

కృష్ణా విశ్వవిద్యాలయం “క్రీడలకు పూర్తిస్థాయిలో ప్రాధాన్యత ఇస్తామన్నారు” వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య డా.వై. కె.సుందరకృష్ణ పేర్కొన్నారు. కృష్టా విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల పురుషుల పుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను బుధవారం స్థానిక ఆంధ్రజాతీయ కళాశాలలో సుందరకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోతహించాలనే ఉద్దేశంతో వారికి ప్రతిభా మార్కులు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. జాతీయ కళాశాల మైదానానికి ఎంతో ప్రాధాన్యత ఉందని కేవలం దాన్ని గుర్తించే ఈ అంతర్‌ కళాశాలల పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీలు ముగిసిన వెంటనే సెలక్షన్‌ ట్రయల్స్‌ను నిర్వహించి ప్రతిభ ఆధారంగా దక్షిణ భారత స్థాయిలో నిర్వహించే అంతర్‌ విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొనేకృష్టా విశ్వవిద్యాలయ పుట్‌బాల్‌ జట్టును ఎంపిక చేసి వారిని తమిళనాడులో జరిగే సౌత్‌జోన్‌ పోటీలకు పంపుతామన్నారు.

Leave a Reply