బందరుకోట రైల్వేలైన్ల పనులు ప్రారంభం …..

0
267

తెరమడుగున పడిన బందరుకోట రైల్వే లైను పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. గతంలో ఈ రైలు మార్గం బందరుకోట వరకు ఉండేది. అయితే మొదటి దశలో కిలో మీటరు పొడవున రైల్వే లైను పనులు చేపట్టారు. ఇందుకు సర్వే దాదాపు పూర్తయింది. రైల్వే ట్రాకు నిర్మాణానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు.వస్తు సామగ్రిని సమాయత్త పరచుకున్నారు. బందరు రైల్వే స్టేషన్‌ను మోడల్‌ స్టేషన్‌గా రూపదిద్దేందుకు బ్రిటీషు కాలం నాటి రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టారు. బందరు రైల్వే స్టేషన్‌లో మరిన్ని రైళ్లు పార్కింగ్‌ చేసేందుకు వీలుగా ట్రాక్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. డబుల్‌ ట్రాక్‌ ఎర్పాటు కోసం రైల్వేలైన్లను కోట వరకు విస్తరిస్తున్నారు.

Leave a Reply