జిల్లా స్థాయి పోటీలకు ఏడు ప్రోజెక్టుల ఎంపిక….

0
422

కడప జిల్లా రాజంపేటలో పంద రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ప్రాజెక్టుల పోటీల్లో జిల్లాకు చెందిన ఏడు ప్రాజెక్టులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. 18 జిల్లాలకు చెందిన
ప్రాజెక్టులను ప్రదర్శించగా అత్యధిక ప్రాజెక్టులు జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో 51 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి. ఎంపిక కాగా కృష్ణాజిల్లా నుంచి ఏడు, కర్నూలు జిల్లా ప్రాజెక్టులు ఆరు,విశాఖ జిల్లా నుంచి ఆరు, గుంటూరు జిల్లావి ఐదు, కడప జిల్లా నుంచి ఐదు, శ్రీకాకుళం జిల్లా ప్రాజెక్టులు నాలుగు, నెల్లూరు జిల్లా నుంచి నాలుగు, ప్రకాశం జిల్లా నుంచి మూడు, అనంతపురం జిల్లా నుంచి మూడు,పశ్చిమగోదావరి జిల్లా నుంచి మూడు, తూర్పుగోదావరి జిల్లా ప్రాజెక్టులు రెండు, చిత్తూరు జిల్లా నుంచి ఒకటి,విజయనగరం జిల్లా నుంచి ఒకటి ఎంపికయ్యాయి.జిల్లాలో కానూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్ధిని ఆర్‌.యువపూజిత, పొద్దుటూరి యశ్విత, విజయవాడ గాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ విద్యార్థి ఎస్‌డి. గఫార్‌,బంటుమిల్లి కొమ్మారెడ్డి టాలెంట్‌ స్కూల్‌ విద్యార్థి ఎండి. ఖాన్‌,విజయవాడ గుణదల సెంట్‌ జోసెఫ్‌ ఇంగ్లీషు మీడియంవిద్యార్థిని ఎం. యశస్వి, విజయవాడ పి.బి. సిద్దార్ధ స్కూల్‌ విద్యార్థి వి. సాయి అక్షర, కలిదిండి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్ధిని ఎన్‌. నాగలక్ష్మి తయారు చేసిన ప్రాజెక్టులు ఎంపిక.ఈ సందర్భంగా విజేతలను డీఈవో ఎంవి. రాజ్యలక్ష్మీ,సైన్స్‌ ఆఫీసర్‌ ఎం. హుస్సేన్‌లు అభినందించారు.

Leave a Reply