ఖతర్‌ ఓపెన్ విజేతగా బోపన్న జోడీ…..

0
389

భారత టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను సాధించాడు. నెదర్లాండ్‌ ఆటగాడు వెస్లీ కూలాఫ్‌తో కలిసి బోపన్న ‘ఖతర్‌ ఓపెన్‌ ఏటీపీ 250’ టోర్నీలో విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో బాంబ్రిడ్జ్‌ (ఇంగ్లాండ్‌)-శాంటియాగో (మెక్సికో) జంటని బోపన్న జోడీ 3-6, 6-2, 10-6 తేడాతో ఓడించింది. దీంతో బోపన్న జోడీ 76,870 డాలర్ల ప్రైజ్‌మనీతో పాటు 250 ఏటీపీ ర్యాంకింగ్‌ పాయింట్లు గెలుచుకుంది. బోపన్న ఖాతాలో 19వ డబుల్స్‌ టైటిల్ ఇది. సెమీఫైనల్లో బోపన్న-కూలాఫ్‌ జంట 7-5,6-2 తేడాతో హెన్రీ కొంటినెన్‌ (ఫిన్‌లాండ్‌)- స్కుగోర్‌ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించింది.

Leave a Reply