కృష్ణా విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులు…

0
521

కృష్ణా విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులు ప్రవేశపెడతామని రిజిస్టార్‌ కృష్ణారెడ్డి అన్నారు. ఐదు రోజుల పాటు పద్మావతి బీఈడీ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన కరికులం డెవలప్‌మెంట్‌ కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రిజిష్టర్‌ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రానున్న విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులను ప్రవేశపెడతామన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయాన్ని త్వరలో నూతన భవనాల్లోకి తీసుకువెళతామన్నారు. విద్యాలయాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తాను రిజిష్ట్రార్‌గా ఏరికోరి వచ్చానన్నారు. స్వామి వివేకానంద బోధనలు ఆధారం చేసుకుని విద్యార్దులు వ్యక్తిత్వాన్నిపెంపొందించుకోవాలన్నారు. ప్రిన్సిపాల్‌ డా. శ్రైలజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply