కుముదవల్లికి సత్కారం…

0
482

ఆధ్యాత్మిక ప్రవచకురాలు కూరపాటి కుముదవల్లిని మంగళవారం ఘనంగా సత్కరించారు. బలరామునిపేట యతిరాజ భవనంలో ఆమె గోదాదేవి పాశురాలను భక్తులకు వినిపించారు. ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా కుముదవల్లిని ఘనంగా సత్కరించారు. వేంకటేశ్వర స్వామికి శ్రీకర ఆచార్యులు ప్రత్యేక అర్చనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు శేషాచార్యులు, పాలకవర్గ సభ్యులు కంతేటి కులశేఖర ఆళ్వార్‌, దోరడ్ల వెంకట శ్రీహరి, కంతేటి శ్రీనివాస శెట్టి, గెల్లిబాపనరావు, మాజేటి మురళి వెంకటరామయ్య, తాడేపల్లి మల్లికార్జునరావు, వేములకుమారస్వామి, కంతేటి లక్ష్మి, వేముల లక్ష్మి, తదితరులు పాల్లొన్నారు.

Leave a Reply