కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియామకాలు ..కోవిడ్19…

0
328

కోవిడ్19 వ్యాధికి చికిత్స మరియు అదుపు చేయడంలో భాగంగా అవసరమైన అభ్యర్థుల కోసం కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియామకాలకు గాను ఉద్యోగ ప్రకటన జారీ చేయడమైనది.

సంబంధిత జిల్లా కలెక్టర్లు నియామకాలు జరిపేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

కోవిడ్ 19 కార్యక్రమాల్లో సేవలు అందించిన అభ్యర్థులకు భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యోగ నియామకాల్లో తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని తెలుపుతూ రాష్ట్రంలో ఉన్న వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖలోని అన్ని విభాగ అధిపతులకు తెలియజేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

దీంతోపాటు కోవిడ్ 19 విధులలో సేవలు అందించడానికి ముందుకు వచ్చే కాంట్రాక్టు మరియు ఔట్ సోర్స్ సిబ్బందికి భవిష్యత్తులో చేపట్టబోయే రెగ్యులర్ నియామకాలలో 15శాతం వెయిటేజి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పై సూచనలు అనుసరించి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖలోని అన్ని విభాగాల అధిపతులు తగిన చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించడమైనది.

Leave a Reply