ఇక అన్నిరకాల షాపులూ తెరచుకోవచ్చు… షరతులు వర్తిస్తాయ్…

0
447

గుడ్ న్యూస్… ఇక అన్నిరకాల షాపులూ తెరచుకోవచ్చు… షరతులు వర్తిస్తాయ్…
కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుండటంతో… షాపులు తెరచుకోవచ్చని కేంద్రం చెప్పింది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు… డిమాండ్ చేస్తుండటంతో… కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని షాపులూ తెరచుకోవచ్చని తెలిపింది. ఐతే… కొన్ని కండీషన్లు పెట్టింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని తెలిపింది. ఐతే… ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది కాబట్టి… తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు. అదే ఏపీలో కేంద్ర వెసులుబాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులూ తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… కేంద్ర చెప్పిన కండీషన్ల ప్రకారం షాపులు తెరచుకోవచ్చు. ఐతే… దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు.

మరో ముఖ్య విషయమేంటంటే… హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి వీల్లేదు. ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు మాత్రమే తెరవొచ్చని కండీషన్ పెట్టింది. ఇప్పుడు మాత్రం అన్ని రకాల షాపులూ తెరచుకోవచ్చు. అంటే స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు. ఐతే… రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి. అలాగే… ఇదివరకట్లా అందరు ఉద్యోగులూ ఆ షాపుల్లో ఉండకూడదు. సగం మంది ఉద్యోగులతోనే (50 per cent strength of workers) నడపాలి. అలాగే సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యాలి. అలాగే అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.

ఇండియాలో ఇప్పుడిప్పుడే కరోనా జోరందుకుంటోంది. శుక్రవారం ఒక్క రోజే 1752 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 23452కి చేరింది. వీరిలో 4814 మంది మాత్రం పూర్తిగా రికవరీ అయ్యారు. ఇక శుక్రవారం కొత్తగా 37 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 723కి చేరింది.

కేంద్రం మార్చి 24న తొలిసారి లాక్‌డౌన్ ప్రకటించింది. అది ఏప్రిల్ 14న ముగిసింది. దాన్ని పొడిగిస్తూ… మే 3 వరకూ లాక్‌డౌన్ ప్రకటించింది. ఐతే… లాక్‌డౌన్ మొదలై 30 రోజులు పూర్తవడంతో… కేంద్రం ఈ తాజా సడలింపులు ప్రకటించింది.

Leave a Reply