ఆర్సీహెచ్ హోటల్లో అగ్నిప్రమాదం..

0
663

మచిలీపట్నం రాజావారి సెంటర్లో ఉన్న ఆర్సీహెచ్ హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోటల్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. హోటల్ రద్దీగా ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. అంతా చూస్తుండగానే క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి. అగ్నికీలలు ఎగసిపడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు.

స్థానికులు స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. హోటల్‌లో ఉన్న కస్టమర్లు, సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే బయటకు వచ్చేయడంతో ప్రాణనష్టం తప్పింది.హోటల్ ఫర్నిచర్ కాలి బూడిదవడంతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలపై ఫైర్ సిబ్బంది ఆరా తీస్తున్నారు.


Leave a Reply