ఆటకు వయస్సుతో పనిలేదంటున్న వృద్ధుడు…

0
529

బ్యాట్‌ పటుకొని క్రికెట్‌ ఆడుతున్న ఈ వృద్ధుడి పేరు జగ్గయ్య. వయస్సు67 సంవత్సరాలు పై మాటే. యుక్త వయన్సులో ఆయనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. పలు టోర్నమెంట్లలో సత్తాచూపాడు. అందులో మచిలీపట్నంలో జరిగిన ఓ టోర్నమెంట్‌లో 11 బంతుల్లో ఏకంగా 50 పరుగులు చేసిన రికార్డ్‌ తనకే ఉంది. పెళ్లి తర్వాత క్రికెట్‌ ఆటకు దూరం కావడంతో
ఎక్కడ క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగినా వెళ్లి సరదాగా కాసేపు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేస్తుంటారు. ఆయన ఉంటున్న ఇంటికి సమీపంలోనే విజయవాడ సిద్ధార్ధ కళాశాల గ్రాండ్‌ ఉండటం… సరదగా క్రికెట్‌ ఆడుతున్న కుర్రాళ్ల దగ్గరకు వెళ్లి కాసేపు తాను ఆడతానంటూ బతిమాలు కోవడం పరిపాటిగా మారింది. బాబాయ్‌ ఇది రబ్బరు బాలు కాదు, కార్క్‌ బాల్‌ అంటూ ఎత్తిపొడిచినా..అవేవి పట్టించుకోకుండా బ్యాటింగ్‌ చేపట్టి వచ్చిన ప్రతిబాల్‌ను పరుగులు తీయిస్తున్నాడు. బౌలింగ్‌లో కూడా ఆయనకు ఆయనే సాటి.ఆయన కొట్టే షాట్స్‌కు కుర్రకారు నోరు వెళ్లబెట్టడం ఖాయం. చివరకు ‘బాబాయ్‌ నువ్వు నూపర్‌ అంటూ అభినందించి కుర్రకారు ఇళ్లకు సాగిపోతున్నారు.

Leave a Reply