ఆకట్టుకున్న మైక్రో చిత్ర ప్రదర్శన

0
619

ప్రముఖ మైక్రో చిత్రకారుడు గేదెల అప్పారావు ఆధ్వర్యంలో స్తానిక జిల్లా పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మైక్రో చిత్ర ప్రదర్శన ఆకట్టుకుంది. నువ్వు గింజపై ఇందిరాగాంధీ, దోసగింజపై తాజ్‌మహల్‌, సొరగింజపై వెంకటేశ్వరస్వామి, పొట్లగింజపై పద్మావతి అమ్మవారి చిత్రాలను చిత్రకారుడు అప్పారావు ప్రదర్శించారు. కాగితపు అంచుపై గీనిన వెంకటేశ్వరస్వామి చిత్రం అందరినీ ఆకట్టుకుంది. జడ్పీ ఈవో సూర్యప్రకాష్‌రావు ఈ చిత్ర ప్రదర్శన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఉద్యోగుల సంఘం నాయకులు దారపు శ్రీనివాస్‌, ఆకూరి శ్రీనివాసరావు, ఎంపీడీవో కృష్ణమోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పారావును జడ్పీ సీఈవో సత్కరించారు.

Leave a Reply