అంబరాన్నిఅంటిన సంక్రాంతి సంబరాలు….

0
286

నగరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.భోగి సందర్భంగా చాల మంది ఉదయాన్నే భోగిమంటలతో పండగను ప్రారంభించారు.కోడి పందాలతో నగరం కోలాహలంగా మారింది.కలెక్టర్‌ ఇంతియాజ్‌, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావులు గోలీలు, గోడింగ్‌ బిళ్ల,వాలీబాల్‌, కబడ్సీ ఆటలు ఆడారు. ప్రముఖ నాట్యాచార్యుడు ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అవనిగడ్డ ప్రగతి విద్యాలయానికి చెందిన విద్యార్ధుల కర్రసాము, ఘంటసాలకు చెందిన శ్రీకాకుళేశ్వర భక్త బృందం, పాపవినాశానికి చెందిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గొబ్బెమ్మ పాటలు, హరిదాసులగీతాలు, గంగిరెద్దుల విన్యాసాలు, తప్పెటగుళ్లు పండగ వాతావరణాన్ని తెచ్చాయి. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్షృత్వం, డ్యాన్స్‌ పోటీల్లో విజేతలకు కలెక్టర్‌
ఇంతియాజ్‌ బహుమతులు అందజేశారు.నగరంలోని అయ్యప్పస్వామి ఆలయంలో జ్యోతి దర్శనంతో భక్తులు తరించారు.

Leave a Reply